![]() |
![]() |

సూపర్ సింగర్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఇందులో పాత ప్లే బ్యాక్ సింగర్స్ అంతా వచ్చారు. ఇక వాళ్ళను చూసేసరికి హోస్ట్ శ్రీముఖి ఆనందం అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా.. ‘కుర్చీ మడతపెట్టి’ అనే పాటే వినిపిస్తోంది. స్టేజి మీదకు వచ్చిన ప్లే బ్యాక్ సింగర్ సాహితితో ఈ పాట పాడించింది శ్రీముఖి.. ఒక్క కుర్చీనే కాదు, మంచాన్ని, సోఫాని మడతపెడితే సాహితిలా ఉంటుంది అంటూ ఫన్నీ కౌంటర్ వేసింది..తర్వాత కంటెస్టెంట్ వెంకటేష్ వచ్చి శ్రీముఖి మీద అద్దిరిపోయే కవిత చెప్పి రెడ్ రోజ్ ఇచ్చేసాడు. "శ్రీముఖి..ఎప్పుడో పడిపోయా నీ మాటకి..అందుకే నేను వెయ్యి సార్లు తలుచుకుంటా రోజుకి...నువ్వు ఓకే అంటే వెళదాం సికారుకు" అంటూ ఫన్నీ కవిత చెప్పేసరికి శ్రీముఖి ఫేస్ వెలిగిపోయింది. ఇక అక్కడితో ఆగలేదు వెంకీ..వెంటనే రెడ్ రోజ్ తీసుకుని మోకాళ్ళ మీద కూర్చుని ఇచ్చాడు. ఇక శ్రీముఖి ఆ పువ్వు తీసుకుని వెంకీ బుగ్గ మీద అలా సుతారంగా తాకించింది. ఇక అసలు హంగామా అంతా ఫైనల్ లో మొదలయ్యింది.
"ఇక స్కోర్స్ విషయానికి వస్తే ఏ వివాదాలు లేవు" అని అనంత శ్రీరామ్ అనేసరికి "శ్వేతా గారు 7 ఇచ్చారు..అంటే మంగ్లీ, రాహుల్ కాదా " అంది శ్రీముఖి. " ఆమె అక్కడ ఎలా పెర్ఫార్మ్ చేసింది అనేది ఇంపార్టెంట్ ..ఊరికే రాలేదు.. మీరు అలా అనడం తప్పు’ అంటూ అనంత శ్రీరామ్‌పై ఫైర్ అయ్యింది మంగ్లీ. దీంతో అనంత శ్రీరామ్.. ‘నేను అన్న మాటని వెనక్కి తీసుకోవట్లేదు" అని ఇంకా గట్టిగా బెట్టు చేసాడు. దాంతో రాహుల్ సిప్లిగంజ్‌కి మండిపోయింది. ‘మడిచి జేబులో పెట్టుకోండి అన్న మాటను..నేను బెస్ట్ అని చెప్పట్లేదు కానీ నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా" అని చెప్తున్నా..అంటూ కౌంటర్ ఇచ్చాడు రాహుల్ సిప్లిగంజ్.
![]() |
![]() |